Monday, November 6, 2017

కంటి చెమ్మ

కంటి చెమ్మ కారణం బాధే అవుతుందా.. జ్ఞాపకం కూడా అవుతుందేమో అప్పుడప్పుడూ..
జ్ఞాపకాలు ఎంత విచిత్రమైనవి, ఒక్కోసారి బాధని సంతోషాన్ని ఒకేసారి అనుభవం లోకి తెస్తాయి..





Saturday, November 4, 2017

వదిలిన ప్రాణం

ఇష్టపడినవి దొరకటానికి, దొరికిన వాటిని ఇష్టపడటానికి
ఎంత లేదన్నా కొంచెం తేడా ఉంటుంది,
ఎంత బావున్నా ఆ తేడా ఎప్పుడో ఒకసారి
తెలుస్తూ ఉంటుంది,
అలా తెలిసేటప్పుడు మాత్రం నిజంగానే
గుండెలో నొప్పిగా ఉంటుంది,
ఆ నొప్పి , ఉన్న ప్రాణాలు తీయకపోయినా
వదిలేసిన ప్రాణాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.

Thursday, November 2, 2017

అతిశయమూ.. అద్భుతమూ..

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి.. పూలవాసన అతిశయమే  !
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా.. వాన నీరు అతిశయమే  !
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులు అతిశయమే !
తనువున ప్రాణం ఏ చోటనున్నదో..  ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో.. ఆలోచిస్తే అతిశయమే !


అతిశయం అన్న చోట "అద్భుతం " అని వుంటే ఇంకా బావుంటుందేమో..

(జీన్స్ సినిమా నుండి) 

Friday, September 22, 2017

ప్రేమంటే ఏమిటంటే..

మనసుతో మనసునే ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తియ్యనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం..

ఇవి ఆనందం సినిమా లో "ప్రేమంటే ఏమిటంటే" పాటలో దొరికాయి.

పిల్లల కథలు: నిజాయితీ

సేకరణ: chotakids.com (ఈ సైట్ లో ఇంకా చాలా కథలు ఉన్నాయి )






Monday, September 11, 2017

ఏం చేయను ??

ప్రేమించడానికి అవతలి వ్యక్తి అభిప్రాయాలతో ఏకీభవించనవసం లేదు...
ఈ ప్రపంచం లో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకలా ఉండవు...
అభిప్రాయం వేరు, గొడవ వేరు...
నచ్చని విషయాన్ని గొడవ పడకుండా చెప్పగలగటం ఒక కళ... కలలో కూడా నాకు రాని కళ !
☺☺☺


Friday, September 1, 2017

నీతోటి నడిచే..

నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింత..

Image result for walking couple manga



Wednesday, August 30, 2017

తెలుగు సేవ

మాతృభాషా దినోత్సవం - ఇంక మూడేళ్ళు కూడా నిండని మా అబ్బాయి అ నుండి ఱ వరకు నేర్చుకున్నా..  తెలుగులో అంకెలు ఒకటి, రెండు, అని పది వరకు చెపుతున్నా.. నాన్నా అని పిలుస్తున్నా.. కన్నా నిదురించరా అనో లేక చిట్టి చిలకమ్మా అనో పాటలు పాడుతున్నా.. ఉదయం లేవగానే అమ్మా, పాలు అని అడుగుతున్నా - విదేశం లో నేను చేయగలిగిన.. చేస్తున్న పిసరంత తెలుగు సేవ తో  ప్రతీ రోజూ ఉత్సవమే !


Tuesday, August 15, 2017

వెతుకులాట

నేను బ్లాగు మొదలెట్టిన కొత్తలో రాసుకున్న మాట...చిన్న కాగితాన్ని వదలకుండా చదివే నేను ఈ బ్లాగు లోకం లొ వున్న సాహిత్యాన్ని చూసి మైమరచి పోయాను. (నిజానికి పండగ చేస్కుంటున్నాను )

ఇప్పుడేమో రాసే వాళ్ళు అందరు ఎటు మాయం అయిపోయారో తెలీక వెతుకుతూనే ఉన్నాను.కొంతలో కొంత నయం వెబ్ పత్రికలు కనిపిస్తూ ఉన్నాయి.



Monday, August 14, 2017

ఆకాశాన హరివిల్లు

దాదాపు 2 సంవత్సరాలు అయిందేమో నిన్ను చూసి... అందుకే ఈసారి కెమేరా లో పట్టి పెట్టుకున్నా....
ప్రణవ్ పెద్దయ్యాక చూపించాలి కదా.. తను నిన్ను మొదటిసారి చూసింది ఇలా అని...



Thursday, February 16, 2017

నేను USA వచ్చి అప్పుడే నాలుగేళ్ళు అయిపోయిందా...!?
ఉరుకులు..పరుగులు.. కాలం తో పాటూ...