నా..

లోలోపలి అలోచనలు..పంచుకోవాలనే ఆశ తో ఈ బ్లాగ్ మొదలెట్టాను, కొంచెం బద్దకం ఇంకొంచెం రాయటం లో అనుభవరాహిత్యం అనే పట్టాల మీద పడుతూ లేస్తూ మొదలైన అడుగులు పరుగులు తీయాలని కోరుకుంటున్న నేను నిజానికి ఓ పుస్తకాల పురుగుని.. చిన్నప్పుడే మన ప్రతిభ గుర్తించేసిన నాన్న నన్ను ముద్దుగా పు.రు.గు(పుస్తకాలు రుబ్బే గురుగు) అనే వారు, ఇక్కడ రుబ్బే అంటే తినేసే అని అర్థం అన్నమాట. చిన్న కాగితాన్ని వదలకుండా చదివే నేను ఈ బ్లాగు లోకం లొ వున్న సాహిత్యాన్ని చూసి మైమరచి పోయాను. (నిజానికి పండగ చేస్కుంటున్నాను).

No comments:

Post a Comment