Monday, November 6, 2017

కంటి చెమ్మ

కంటి చెమ్మ కారణం బాధే అవుతుందా.. జ్ఞాపకం కూడా అవుతుందేమో అప్పుడప్పుడూ..
జ్ఞాపకాలు ఎంత విచిత్రమైనవి, ఒక్కోసారి బాధని సంతోషాన్ని ఒకేసారి అనుభవం లోకి తెస్తాయి..





Saturday, November 4, 2017

వదిలిన ప్రాణం

ఇష్టపడినవి దొరకటానికి, దొరికిన వాటిని ఇష్టపడటానికి
ఎంత లేదన్నా కొంచెం తేడా ఉంటుంది,
ఎంత బావున్నా ఆ తేడా ఎప్పుడో ఒకసారి
తెలుస్తూ ఉంటుంది,
అలా తెలిసేటప్పుడు మాత్రం నిజంగానే
గుండెలో నొప్పిగా ఉంటుంది,
ఆ నొప్పి , ఉన్న ప్రాణాలు తీయకపోయినా
వదిలేసిన ప్రాణాన్ని గుర్తుకు తెస్తూ ఉంటుంది.

Thursday, November 2, 2017

అతిశయమూ.. అద్భుతమూ..

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి.. పూలవాసన అతిశయమే  !
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా.. వాన నీరు అతిశయమే  !
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులు అతిశయమే !
తనువున ప్రాణం ఏ చోటనున్నదో..  ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో.. ఆలోచిస్తే అతిశయమే !


అతిశయం అన్న చోట "అద్భుతం " అని వుంటే ఇంకా బావుంటుందేమో..

(జీన్స్ సినిమా నుండి)