Showing posts with label పాటలు. Show all posts
Showing posts with label పాటలు. Show all posts

Tuesday, November 12, 2013

చూడొద్దే నను చూడొద్దే

చూడొద్దే నను చూడొద్దే  చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే  మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే

వద్దూ వద్దంటూ నేనన్నా వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై వున్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వయి నిలిచావే

వద్దూ వద్దంటూ నువ్వున్నా వలపే పుట్టింది నీ పైన
కాదు కాదంటూ నువ్వున్నా కడలే పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగును లే
వొంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే



'ఆరు ' సినిమా లో ఈ పాట కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.